అదే విధానం కొనసాగించాలి: సినిమా టిక్కెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టే

  • చిత్రం విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు
  • హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్
  • ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీం సూచన
సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది.

సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంటే చిత్రం విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరగగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. టిక్కెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరించే విధానాన్నే కొనసాగించాలని సూచించింది.

Mythri Movie Makers
Telangana High Court
Supreme Court
Movie ticket prices
Ticket price hike

More Telugu News